ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ ను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క నిబంధ‌న‌లు మార్పు చేస్తూ ప్ర‌భుత్వం పంపిన ఆర్టినెన్స్‌ను గ‌వ‌ర్న‌ర్ ఈ రోజు ఆమోదిస్తూ ముద్ర వేశారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేయ‌గా ప్ర‌భుత్వానికి వ‌చ్చిన అధికారంతో ఈ రోజు ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను తొల‌గించింది. ఇక క‌రోనా ప్ర‌భావంతో ర‌మేష్‌కుమార్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఏపీలో పెద్ద రాజ‌కీయ ర‌గ‌డ‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే. 

 

వాస్త‌వంగా గ‌త నెల‌లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, పంచాయ‌తీలు, మున్సిపాల్టీలు, న‌గ‌ర పంచాయ‌తీలు, కార్పోరేష‌న్ల ఎన్నిక‌ల‌కు ఈసీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. అయితే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మై నామినేష‌న్లు కూడా ముగుస్తోన్న వేళ ఈసీ త‌న విచ‌క్ష‌ణ అధికారంతో స‌డెన్‌గా ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. ఆరు వారాల పాటు ఎన్నిక‌లు వాయిదా వేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకోగా.. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ విమ‌ర్శ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇక ఇప్పుడు ఆయ‌న్ను తొల‌గించే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: