ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా భారీన పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా పేరు వింటే గజగజా వణికిపోతున్నాయి. కరోనా వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువలో ఉంది. 
 
ఇప్పటివరకు 2,00,000 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. అగ్రరాజ్యం అమెరికాను కరోనా చిగురుటాకులా వణికిస్తోంది. నిన్న ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులతో కలిపి 29,21,414 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 10,00,000 కు చేరువలో ఉండగా మృతుల సంఖ్య 54,000కు చేరింది. అమెరికాలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతోందని ట్రంప్ చెబుతున్నారు. 
 
భారత్ లో గత 24 గంటల్లో 1990 కేసులు నమోదయ్యాయి. నిన్న నమోదైన కేసులతో కలిపి భారత్ లో కరోనా కేసుల సంఖ్య 26,400 దాటింది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: