టాలీవుడ్లో టైర్ 2 హీరోలలో ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన హీరోగా పేరు సంపాదించారు హీరో నిఖిల్. కార్తికేయ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్, కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు. ఆ తర్వాత నటించిన కొన్ని చిత్రాలు మిక్స్డ్ టాక్ రావడంతో కొంత గ్రాఫ్ తగ్గింది. ఈసారి సక్సెస్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పిరియాడిక్ డ్రామాగా రాబోతున్న చిత్రం స్వయంభు. ఈ సినిమా రియల్ స్టోరీ కావడం చేత, ఈ సినిమా కోసం లుక్స్ అండ్ గెటప్ కూడా చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.


దాదాపుగా ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల  సమయం తీసుకున్నారు నిఖిల్. ఇంత లేటుగా వచ్చినా కూడా సినిమా పర్ఫెక్ట్ గా రావాలన్నదే కారణమని అలాగే సిజి వర్క్ ,పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందని తెలిపారు. నిన్నటి రోజున విడుదలైన టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం(మహేశ్ , రామ్ చరణ్, ప్రభాస్)తమ సినిమా కోసం పెడుతున్న డెడికేషన్ తనను ఇన్స్పైర్గా చేసిందంటూ తెలిపారు. స్వయంభు సినిమాలో వారియర్ క్యారెక్టర్ చేయడానికి సుమారుగా 45 రోజులు ట్రైనింగ్ తీసుకున్నానని తెలిపారు.



సినిమా కథను నమ్మి చాలా కష్టపడ్డానని ఒక రియల్ స్టోరీని చూపించబోతున్నామంటూ తెలిపారు. ఇందులో హీరోయిన్స్ గా నభా నటేష్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. స్వయంభు టీజర్ ఈవెంట్లో కార్తికేయ 3 పై మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని, వచ్చే ఏడాదిలో  విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. అలాగే స్వయంభు పార్ట్ 2 కూడా ఉంటుందంటు తెలియజేశారు. ఫిబ్రవరి 13వ తేదీన స్వయంభు సినిమా విడుదల కావాల్సి ఉండగా , కొన్ని కారణాల చేత వాయిదా పడింది. మరి ఈ సినిమాని సమ్మర్ క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి విడుదల తేదీ పైన ట్రైలర్ తో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: