ఈ వేడుకలో హీరోయిన్ శివానిని పలకరిస్తూ.. ఆమెను హగ్ చేసుకుందామని వెళ్లాను.. ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాను, ఆమె పద్ధతిగా చీర కట్టుకొని ఉండడాన్ని చూపిస్తూ అందరూ శివాజీ చేసినట్టే వింటున్నారంటున్నారు. అందుకే ఈ మధ్య వేడుకలలో ఎక్కడ చూసినా కూడా మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారంటూ సెటైరికల్ గా మాట్లాడారు. అందరూ ఇలా పద్ధతిగా ఉంటే హగ్ చేసుకోవడం కూడా చాలా కష్టమే, అందుకే తాను హాగ్ చేసుకోవడం లేదంటూ, హీరోయిన్, యాంకర్ స్రవంతిని ఒకరినొకరు కౌగిలించుకోమంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అయితే ఈ విషయం మాత్రం ఇప్పుడు మరొక వివాదానికి దారి తీస్తోంది. గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పైన చాలామంది సెలబ్రిటీలు చేసిన కామెంట్స్ ఎంతలా మారాయో తెలిసిందే. అయితే ఇప్పుడు నరేష్ కావాలని శివాజీ పేరును ప్రస్తావిస్తూ మరి చీరకట్టు గురించి ఇలా మాట్లాడడం హగ్గులతో ముడిపెట్టడంతో పలువురు నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ వ్యాఖ్యలు కామెడీగా చూస్తూ ఉంటే మరి కొంతమంది హీరోయిన్ల దుస్తులు అంశాన్ని మళ్లీ వివాదంలోకి నరేష్ లాగారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీకే నరేష్ చేసిన ఈ కామెంట్ కి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి