ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి ఇప్పటివరకు ఓ పెద్ద ఇష్యూ నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో లడ్డు లో కల్తీ నెయ్యి కలపడం. తిరుమల లడ్డులో పంది నెయ్యిని కలిపారు అంటూ జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ మధ్యకాలంలో తిరుమల లడ్డులో కల్తీ కలవలేదని తేలిపోయిందంటూ వైసిపి ప్రచారం చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో ఇష్యూ బయటకు వచ్చింది. అదేంటంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ కంపెనీలోని పెరుగులో అసలు పెరుగే లేదు అంటూ ఓ వ్యక్తి ప్రూఫ్స్ తో సహా బయటపెట్టారు. గురుగ్రాంలోని ఒక వ్యక్తి హెరిటేజ్ కి సంబంధించిన పెరుగులో అసలు పెరుగేలేదని వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అసలు విషయం తేల్చేశారు. 

అంతేకాదు అసలు విషయం తేల్చాక హెరిటేజ్ కంపెనీపై ఏకంగా లక్ష రూపాయల పెనాల్టీ వేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలామంది నీతులు చెప్పడం కాదు పాటించాలి.. బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగా లేనప్పుడు నీతులు చెప్పకూడదు అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ ప్రచారంపై తాజాగా హెరిటేజ్ సంస్థ మాట్లాడుతూ.. హెరిటేజ్ పై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాన్ని చేయిస్తున్నారు. అసలు హెరిటేజ్ కి సంబంధించిన పెరుగుని మూడో వ్యక్తి సమక్షంలో సేకరించలేదు. పెరుగు నమూనా సేకరించే క్రమంలో లోపాలు జరిగాయని, మా కంపెనీ నిర్దేశిత ప్రమాణాల కంటే ఎస్ఎన్ఎఫ్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు ల్యాబ్ టెస్టులో తేలింది.

 కొంతమంది కావాలనే దుష్ప్రచారాన్ని చేయిస్తున్నారు. మా కంపెనీ ఉత్పత్తులను తయారు చేసేటప్పుడు అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తారు. ఎట్టి పరిస్థితిలో వెన్న శాతం తగ్గించరు అంటూ బుకాయిస్తున్నారు. దీంతో చాలామంది వైసీపి అభిమానులు మరి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని అంటున్నారు మరి తిరుమల లడ్డు నీ ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు ఏ వ్యక్తి సమక్షంలో నమూనా సేకరించి టెస్ట్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: