పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో  హిట్ అయిన సినిమాలు కొన్ని మాత్రమే మిగతా అన్ని ఫ్లాప్ లు గానే  మిగిలిపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి లేనంత మంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు  అంత అభిమానులు పెరగడానికి కేవలం సినిమాలు మాత్రమే కారణం కాదు ఆయన నిజాయితీ.. ఎలాంటి కల్మషం లేని మాటలు... స్టార్ హీరో అయినా సామాన్యుడిలా వుండే ఆయన తత్వం.. మంచి కోసం పోరాడే ఆయన దృఢ సంకల్పం ఆయనకు కోట్లాది మంది అభిమానులను తెచ్చిపెట్టాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: