మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. 16 మంది వలస కార్మికులు మృతిచెందడంపై తీవ్ర వేదనకు గురైనట్లు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ... ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడినట్లు తెలిపారు.  వారికి వెంటనే కావాల్సిన అన్ని సహాయ, సహకారాలను అందించనున్నట్లు వెల్లడించారు. ట్రాక్‌పై నిద్రపోతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అంతే కాదు  ఘటనపై రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడినట్లు తెలిపారు.

 

పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా తెలిపినట్లు చెప్పారు.  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. వలస కూలీలు మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ వెళ్తున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

 

వారంతా రైల్వే ట్రాక్ పక్కనే కాలి నడకగా స్వస్థలాలకు వెళుతూ మార్గ మధ్యలో పట్టాలపై నిద్రించినట్లుగా సమాచారం.  ఇదిలా ఉంటే..  ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కలచివేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: