దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3,100 కోట్లను కరోనాను నియంత్రించడానికి కేటాయిస్తున్నట్టు కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. వైద్య పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. 3100 కోట్లలో రూ.2000 కోట్లను వెంటిలేటర్ల కొనుగోలుకు కేంద్రం కేటాయించింది. 
 
1000 కోట్ల రూపాయలు వలస కార్మికుల కోసం, 100 కోట్ల రూపాయలను వ్యాక్సిన్ అభివృద్ధికి కేంద్రం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో నిధులు కేటాయించింది. ప్రతిపక్షాలు కేంద్రం వలస కూలీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణలు చేయడంతో కేంద్రం భారీ స్థాయిలో నిధులు విడుదల చేసింది. వెయ్యి కోట్ల రూపాయలను వలస కూలీల ఆహారం, వసతి, చికిత్స, రవాణా కోసం ఉపయోగించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: