తెలుగు చిత్ర పరిశ్రమలో రానా దగ్గుబాటి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటి వరకు కొంత మంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపిన రానా తాజాగా తనకు కాబోయే భార్య గురించి చెబుతూ అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కనీసం మీడియా లో ఒక వార్త  కూడా  రాకుండా... డైరెక్ట్ గా రానా తన పెళ్లి విషయాన్ని చెప్పేసాడు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే దానికి కూడా అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. 

 

 అయితే తాజాగా రానా దగ్గుబాటికి  సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్... శివ కార్తికేయన్... సైనా  నెహ్వాల్  ఇలా చాలామంది క్రీడారంగ ప్రముఖులు సినీ రంగ ప్రముఖులు రానా దగ్గుబాటి కంగ్రాజులేషన్ చెపుతున్నారు. మీ ఇద్దరి జోడి ఎంతగానో బాగుంది అంటూ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబందించిన పోస్ట్ లు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: