ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. అమెరికా, బ్రెజిల్, మెక్సికోలలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ ఈ దేశాల్లో వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయంటే కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో సులభంగానే అర్థమవుతుంది. గడచిన 24 గంటల్లో బ్రెజిల్ లో 1492 మంది కరోనాతో చనిపోగా మెక్సికోలో 1092, అమెరికాలో 1031 మంది మృతి చెందారు. 
 
బ్రెజిల్ లో నిన్న ఒక్కరోజే 32,000 కేసులు నమోదు కాగా అమెరికాలో 22,000 కేసులు నమోదవుతున్నాయి. ఈ దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 67 లక్షలు దాటగా మరణాల సంఖ్య నాలుగు లక్షలకు చేరువలో ఉంది. మరోవైపు లాక్ డౌన్ సడలింపుల తర్వాత భారత్ లో 9,000కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: