పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్యలు కూడా చేపడుతుంది. జూలై 8 వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. 

 

 29 నుంచి 30 లక్షల ఇళ్ల పట్టాలు  ఇవ్వపోతున్నాం అని పేర్కొన్నారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారిగా ఇళ్ల పట్టాల పై పరిస్థితిని సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఇళ్ల పట్టాల కు సంబంధించి భూ సేకరణ పొజిషన్ అభివృద్ధికి సంబంధించి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: