కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కేసులు‌ పెరుగుతుండటంతో సీఎం యడ్యూరప్ప ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారా లేదా మరోసారి లాక్‌డౌన్‌ విధించమంటారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక దూరంతో పాటు, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని లేకపోతే లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన యడ్యూరప్ప నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలలో బెంగళూరు కూడా ఒకటి కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశంలో గత 24 గంటల్లో 16,922 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 418 మంది మృత్యువాత పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: