ఇంగ్లీషు నేర్చుకోవాలి కానీ, అమ్మ బాషని మరిచిపోకూడదు. తెలుగు భాష లో ఉన్న ప్రావీణ్యం మరే భాష లోనూ లేద ని ఈ సందర్బంగా తెలియచేసారు. నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి గురించి చర్చిస్తా అన్నారు. కృష్ణపట్నం - ఓబులాపురం రైల్వే లైను నా చిరకాల వాంఛ అని వెంకయ్య నాయుడు అన్నారు. శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే లైను పనుల గురించి రైల్వే అధికారులతో చర్చిస్తాను అని చెప్పారు. రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైనా దృష్టి సారించాలి. అందుకు కేంద్రం తోడ్పాటు అందివ్వాలని ప్రధానిమంత్రిని కోరాను అని వెంకయ్య నాయుడు అన్నారు . కరోనా రంగం వల్ల అన్ని రంగాలూ దెబ్బతిన్నా, వ్యవసాయ రంగమే ఉత్పత్తి సాధిస్తుంది అని వెంకయ్య నాయుడు చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి