హైదరాబాద్ నగరంపై మరోసారి ఐటీ ఎటాక్ జరిగింది. ఈ దాడుల్లో అధికారులు భారీ ఎత్తున నల్లధనం గుర్తించినట్టు తెలుస్తోంది. ఇటీవల నగర శివార్లలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ కొందరు రియల్ వ్యాపారులపై దాడులు చేయగా భారీ ఎత్తున నల్లధనం దొరికినట్టు తెలిసింది.
రెండు కంపెనీల్లో చేసిన ఈ సోదాల్లో దాదాపు 700 కోట్ల రూపాయల పై చిలుకు నల్లధనం లావాదేవీలు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ దాడుల్లో 12 కోట్ల రూపాయల నల్లధనాన్ని అధికారులు సీజ్ చేశారు. రెండు కోట్ల బంగారు ఆభరణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: