దేశ‌వ్యాప్తంగా రోజు రోజుకు గ్యాస్, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపై వినియోగ‌దారులు ఎంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నా కేంద్రం మాత్రం రేట్లు త‌గ్గించే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక  గత ఫిబ్రవరిలో వంట గ్యాస్‌ ధరను రూ.125 పెంచిన ప్రభుత్వరంగ చమురు కంపెనీలు.. సిలిండర్‌ ధరను రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించాయి. ఈ రేట్లు ఈ రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమ‌ల్లోకి వ‌స్తున్నాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో రూ.819 ఉన్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.809కి చేరుతుంది. ఇతర మార్కెట్లలోనూ తగ్గించిన ధర అమల్లో ఉంటుందని కంపెనీలు తెలిపాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: