తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ త‌న ప్ర‌సంగంలో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న త‌న‌ను కొంద‌రు ట్రోల్ చేస్తున్నార‌ని ఆమె ఒకింత ఆవేద‌న‌కు గుర‌య్యారు. త‌న‌కు త‌న తమ్ముడు పవన్ కళ్యాణ్‌ తోడుగా ఉన్నారని, ఇకపై తనపై ట్రోల్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా ? అని రత్నప్రభ ప్రశ్నించారు. తాను త‌న 40 ఏళ్ల స‌ర్వీసులో ఎన్నో ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డంతో పాటు ఎంతో మంది పేద ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చాన‌ని ఆమె చెప్పారు.

త‌న స‌ర్వీసులో తాను ఒక ఫైటర్ గా, ఫైర్ బ్రాండ్ గా పనిచేశానని రత్న ప్రభ చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ కు కొత్త దారి చూపిస్తానని రత్న ప్రభ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రాఖీ క‌డ‌తాన‌ని చెప్పి.. ప‌వ‌న్ చేతికి ఓ ఎర్ర తువాలును క‌ట్టారు. దీంతో స‌భా ప్రాంగ‌ణం విజిల్స్‌తో మార్మోగిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: