బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 205, బీజేపీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. యూనెటెడ్ ఫ్రంట్ 1 స్థానంలో, ఇతరులు రెండుస్థానాల్లో ముదంజలో కొనసాగుతున్నారు. బెంగాల్‌లో టీఎంసీ 205 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీకి శుభాకాంక్షలకు తెలియజేశారు. అలాగే, శరద్ పవార్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా దీదీ కి శుభాకాంక్షలు తెలిపారు

.ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ఖాతాలో.. బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో ఉన్న మమతా బెనర్జీకి.. తమిళనాడులో ఆధిక్యంలో ఉన్న స్టాలిన్ కు.. అదే విధంగా కేరళాలో ఆధిక్యంలో ఉన్న సీఎం పినరయి విజయన్ కి శుభాకాంక్షలు తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: