బాలకృష్ణకి తన తండ్రి అంటే ఎంత ప్రేమ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన బయట పెట్టుకుంటూనే ఉంటారు. ఇక గతంలోనే ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీశారు బాలకృష్ణ. రేపు 28న ఎన్టీఆర్ జయంతి నేపధ్యంలో ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో మరో సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని అందరూ భావించగా బాలయ్య మాత్రం తాను పాడిన శ్రీరామ దండకాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తాను ఆలపించిన శ్రీరామ దండకాన్ని రేపు ఉదయం 9.45 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని తన నిర్మాణ సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: