ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం జరిగే ఈ రెండు ఏళ్ళు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ దాదాపు 95 శాతం హామీలు నెరవేర్చామని చెబుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మాత్రం జగన్ ఏమీ చేయలేదని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వారికి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 

''రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? '' అని ఆయన ప్రశ్నించారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే మూడేళ్లలో యువ సీఎం జగన్ నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయని ఆయన అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: