జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఇటీవల పడిన భారీ వర్షాల దెబ్బకు దెబ్బతిన్న చెరువులు, కుంటల పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. 185 చెరువులు, కుంటల పరిరక్షణ కోసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది తెలంగాణా నీటిపారుదలశాఖ.

ఎస్ఈల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేక బృందాలు చెరువులు, కుంటలను పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ నేడు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ లో నిన్నా మొన్నా భారీ వర్షాలు పడ్డాయి. ఈ రోజు రేపు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts