దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని జ‌న‌సేన అధికార ప్రతినిధి పోతిన మ‌హేష్ డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయ చరిత్ర లో భక్తులు ప్రజలు ఒక సీఎం డౌన్ డౌన్ అన్న సందర్భం లేదని మ‌హేష్ చెప్పారు. సీఎం జగన్ ను డౌన్డౌన్ అని భక్తులు ప్రజలు నినదించారని... అంటే దానికి కారణం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసమర్థతే అంటూ వ్యాఖ్యానించారు. దసరా రోజున‌ ఒక ప్రముఖ IAS  కూతురు అంతరాలయంలో కూర్చొవ‌ద్ద‌ని పండితులు వద్దని వారించినా ఏం పూజలు చేశారని ప్ర‌శ్నించారు. సీఎం విచారణ చేపట్టాలని.. సిసిటివి ఫుటేజ్ ను బయట పెట్టాల‌ని డిమాండ్ చేశారు. 

ఈ సారి దసరా ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాయంటూ పోతిన మ‌హేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దసరా ఉత్సవాల్లో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అన్ని వివాదాలేనంటూ వ్యాఖ్యానించారు. మొదటి రోజున అంతరాలయ ప్రాంగణంలో ఎలక్ట్రిషన్ మృతి చెందడం, అన్యమత ప్రచారం, మూలానక్షత్రం రోజున మతవిద్వేషాలు రెచ్చగొట్టే లాగా ఘాట్ రోడ్డుపై బ్యానర్లు ఏర్పాట చేయ‌డం... చివరి రోజున ముఖ్యమంత్రి గారిని డౌన్ డౌన్ అని భక్తులు ప్రజలు  నినదించడం అంటూ పోతిన మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: