మంచిరేవుల పేకాట కేసులో టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్‌ అరెస్ట్ అయ్యారు. ఉప్పర్‌పల్లి కోర్టులో  ఆయ‌న‌ను పోలీసులు హాజరుపరిచారు. శివలింగప్రసాద్‌  క్యాసినో కింగ్‌పిన్‌ గుత్తా సుమన్‌తో కలిసి పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప‌లు ఆధారాలు సేకరించారు. అయితే  శివలింగప్రసాద్ బెయిల్ పిటిషన్ కూడ దాఖలు చేశారు. ఫామ్‌ హౌస్ పేకాట కేసు రోజుకొక కొత్త  మలుపు తిరుగుతున్న‌ది.   ఈ కేసులో గుత్తా సుమనే కింగ్‌పిన్ అనుకుంటే ఇప్పుడు మరో కీలక వ్యక్తి  కూడ తెరపైకి వచ్చాడు. ఈ దందాలో హీరో నాగశౌర్య తండ్రి పాత్ర కూడా ఉన్నద‌ని పోలీసులు గుర్తించారు.

పేకాట నిర్వ‌హిస్తున్న వ్య‌క్తిపై పీడీయాక్ట్ కేసు న‌మోదు చేయ‌నున్నారు. చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్ ఈ యాక్ట్ భుజాన వేసుకున్న వ్య‌క్తి గుత్తాసుమ‌న్‌. హైద‌రాబాద్ న‌గ‌ర  శివారులోని నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ఓ రేంజ్‌లో పేకాట నిర్వహించిన ఘనుడు అత‌ను.  మొత్తం  ఆ రోజు  30మంది వరకూ పేకాట‌రాయుళ్లు  పట్టుబడ్డారు. శ్రీరామ్‌ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేతో పాటు నిజామాబాద్‌, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ  కూడా ఉన్నారు. సినో చిప్స్‌, నోట్ల కట్టలు, స్వైపింగ్ మిషీన్స్‌, కావల్సినంత మందు, వెరైటీ ఫుడ్‌.. అబ్బో ఒక్కటేంటి వీకెండ్‌ మజా అంతా అక్కడే  ఏమి చ‌క్క‌గా దర్శనమిచ్చింది. నాగ‌శౌర్య తండ్రికి బెయిల్ మంజూర‌వుతుందా లేక జైలు శిక్ష ప‌డ‌నుందా అని కొంత స‌మ‌యం త‌రువాత తెలియ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: