ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం  కొణిజేటి రోశయ్య అకాల మరణం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. రాజకీయ చతురత కలిగిన సీనియర్ నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరం అని తెలిపారు. ముఖ్యంగా ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి  వైస్ రాజశేఖరరెడ్డి కి అత్యంత సన్నిహితులు రోశయ్య అని గుర్తు చేసారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగి..  దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు రోశ‌య్య‌.  

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య  ఆత్మకు శాంతి ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను అని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు తగ్గట్టు బడ్జెట్ రూప కల్పన చేసిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జ‌న్మించిన రోష‌య్య‌.. గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభం కావ‌డంతో ఆయ‌న‌కు ఆ రెండు జిల్లాల‌లో రోశ‌య్య‌ను ఎంతో మంది అభిమానిస్తుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: