భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలలో ఈ ఏడాది తెలుగు పద్మాలు వికసించాయి. తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తులకు ఈ ఏడాది పద్మ అవార్డులు వరించాయి. ఇప్పటి వరకూ అందిన సమాచరం ప్రకారం  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  వారు ముగ్గురు కాగా, తెలంగాణ నుంచి నలుగురికి పద్మ పురస్కారాలు లభించినట్లు తెలిసింది. వారెవరంటే ?కోవిడ్-19 టీకా తయారు చేసి ప్రపంచానికి అందించిన బయోటెక్ సంస్థ కు చెందిన  కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారం లభించింది. అదేవిధంగా ప్రముఖ ప్రవచ కర్త, అవధాని, గరికిపాటి నరసింహ రావు కు పద్మశ్రీ లభించింది. అదే విధంగా కూచిపూడి నర్తకి పద్మజా రెడ్డి కి పద్మశ్రీ, మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య కు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. డాక్టర్ శంకర వెంకట ఆదినారాయణ కు పద్మశ్రీ,  ఆంధ్రప్రదేశ్ కు చెందిన  గోసవీడు షేక్ హసన్ కు పద్మశ్రీ లబించింది. యావత్ భారత్ జాతి గర్వ పడే విషయం ఏమిటంటే ఇటీవలఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను పద్మ విభూషన్‌ పురస్కారం ఇవ్వనుంది. రావత్‌తో పాటు ప్రభా ఆత్రే, రాదేశ్యామ్‌ భేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌ సింగ్‌ (మరణానంతరం)కు పద్మ విభూషన్‌తో సత్కరించనున్నట్లు  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: