టాలీవుడ్ స్టార్ హీరో ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు.. తెలుగు నాట ఎంత క్రేజ్‌ స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమా హీరోగానే కాకుండా… ఓ మంచి రాజకీయ నేతగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా సమాజంలో ఏవైన తప్పులు జరిగితే ఆ తప్పులను ఎత్తి చూపుతూ… నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌. అయితే.. ఇందులో భాగంగానే ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ లోని నరసాపురం లో పర్యటించారు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌.మత్స్య కార్మికుల హక్కుల కోసం ఈరోజు నరసాపురం లో పవన్‌ కళ్యాణ్‌ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

ఇందులో భాగంగానే కొద్ది సేపటి క్రితమే నరసాపురం చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ కు ఊహించని పరిణామం ఎదురైంది.నరసాపురం చేరుకున్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌.. తన కాన్వాయ్‌ పైకి నుంచోని .. ప్రజలకు ఇంకా తన అభిమానులకు అభివాదం చేసారు. ఇక ఈ నేపథ్యంలోనే… పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌.. ఒక్కసారిగా కాన్వాయ్‌ పైకి ఎక్కి..పవన్‌ కళ్యాణ్ పై పడిపోయారు. దీంతో బొక్కా బోర్లా పడిపోయాడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్‌ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: