ఉత్తరప్రదేశ్‌లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది. ఈ ఆరో విడతలో గోరఖ్‌పూర్ తో పాటు  10 జిల్లాల పరిధిలోని పోలింగ్ జరుగుతోంది. ఆరో విడతలో 57 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 57 స్థానాల్లో మెుత్తం 676 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

ఈ ఆరో విడతలో 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటేయనున్నారు. ఇక ఈ విడత బరిలో ఉన్న వీఐపీల్లో సీఎం యోగి ఆదిత్యానాథ్,  స్వామి ప్రసాద్‌ మౌర్య, స్వామి ప్రసాద్‌ మౌర్య వంటి వారు ఉన్నారు. గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీలో ఉన్నారు. ఫాజిల్‌నగర్‌ నుంచి  స్వామి ప్రసాద్‌ మౌర్య పోటీలో ఉన్నారు. తమ్‌కుహీరాజ్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ లల్లూ పోటీలో ఉన్నారు. ఈ ఆరో విడత తర్వాత 7 న యూపీలో తుది విడత ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: