రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఇండియాకు రప్పించడంపై మాట్లాడారు. ప్రధానంగా ఖర్కివ్‌ నగరంలో భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుపోయారు. ఆ నగరంపై రష్యా దాడులు ముమ్మరం చేసింది. మొన్న ఈ నగరంలోనే కర్ణాటకు చెందిన ఓ విద్యార్థి రష్యా దాడుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అందుకే.. ఖార్కీవ్ నుంచి ఇండియన్లను సురక్షింతగా వెనక్కి వచ్చేలా చూడాలని పుతిన్‌ను మోడీ కోరారు.

ఖార్కీవ్‌లో చిక్కుకున్న ఇండియన్ విద్యార్థులను సురక్షితంగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని పుతిన్‌ను ప్రధాని మోడీ కోరారు. మోడీ విజ్ఞప్తి మేరకు.. ఖార్కీవ్‌పై దాడులను ఆరు గంటలపాటు రష్యా నిలిపేసినట్టు తెలిసింది. ఆ నగరం నుంచి ఇండియన్లు వెళ్లిపోయేందుకు అనుకూలంగా ఈ యుద్ధం ఆపినట్టు తెలిసింది.  అందుకు అనుగుణంగానే ఇండియా కూడా విద్యార్థులు తరలింపును మరింత వేగవంతం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: