పంటల బీమా పథకంపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అనేక జిల్లాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల ఆర్బీకేలకు, సచివాలయాలకు తాళాలు వేస్తున్నారు. ఇక విపక్షాలు కూడా ఈ పథకంలో లోపాలను టార్గెట్ చేశాయి. వైఎస్సార్ ఉచిత పంటల భీమా చెల్లింపు జగన్ రెడ్డి అంత:పుర రహస్యం లా మారిందని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

జగన్ రెడ్డి అతని కిందిస్థాయి మంది మార్బలం పరిహారం, భీమా సొమ్ముల్ని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు పంచుకుంటున్నారని నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. రైతు పేరు మీద ఏ విధంగా దోచుకోవచ్చో కొత్త విధానాలకు జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారని నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. గ్రామం యూనిట్ గా ఎవరెవరికి భీమా సొమ్ము చెల్లించారో ప్రభుత్వం వివరాలు బహిర్గతం చేయాలని.. అలా చేయకుంటే వైసీపీ నేతలు దోచుకు తిన్నట్లే భావిచాల్సివస్తుందని నక్కా ఆనంద్‌బాబు  అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: