ఏపీలో అప్పుల రాజకీయం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిన చోటల్లా అప్పులు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే తాము కేంద్రం కంటే బెటరేనని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన ఒక్కో కుటుంబంపై ప్రస్తుతం రూ.6.63 లక్షల మేర అప్పు ఉందట. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం అధ్యక్షుడు, ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ నేతి మహేశ్వరరావు చెబుతున్నారు.


రాష్ట్ర అప్పులు రూ.3.98 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం విడ్డూరమంటున్నారాయన. కార్పొరేషన్ల అప్పులు, పెండింగ్‌ బిల్లులన్నీ కలిపితే ఏపీ అప్పులు రూ.8.34 లక్షల కోట్లని ఆయన చెప్పకొచ్చారు. వాస్తవ అప్పులకంటే కేంద్రం ఎందుకు తక్కువ చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని.. అందుకే ఇలా చూపిస్తున్నారని అంటున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: