ఈ దేశంలో బీసీల జనాభా 56% వరకూ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇంత జనాభా కలిగిన బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించలేదంటున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీలకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ప్రజాస్వామ్య ఫలాలు అందలేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన లెక్కల్లో బీసీలకు జాతీయ స్థాయిలో 15% కూడా రిజర్వేషన్లు లేదని ఆర్ కృష్ణయ్య అన్నారు.


దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 16 రాష్ట్రాల నుంచి బీసీ ఎంపీలు ఒకరు కూడా లేరు అని ఆర్ కృష్ణయ్య  అన్నారు.  ఈ దేశంలో ప్రజాస్వామ్యం పోయి ధనస్వామ్యంగా మారిందని ఆర్ కృష్ణయ్య  విమర్శించారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, హైకోర్టు.. సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో రిజర్వేషన్ కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు .బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు ఆర్ కృష్ణయ్య  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: