టీఎస్ పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మిని సిట్ అధికారులు మరోసారి కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఇప్పటికే ఈమెను పలు సార్లు విచారించారు. అయితే ఈ కేసులో ముగ్గురు నిందితులు చెప్పిన విషయాలను నిర్ధారించుకోవడానికి శంకరలక్ష్మిని అడిగి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో షమీమ్, రమేష్ చేసే పని, ఇతర వివరాల గురించి శంకరలక్ష్మిని సిట్ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.


శంకర లక్ష్మిని ఇప్పటికే సిట్ అధికారులు రెండుసార్లు ప్రశ్నించి ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆమెను సాక్షిగా చేర్చారు. శంకరలక్ష్మి తన డైరీలో రాసుకున్న లాగిన్ పాస్ వర్డ్ ను దొంగిలించిన ప్రవీణ్.. రాజశేఖర్ రెడ్డి సాయంతో కంప్యూటర్ లోకి చొరబడినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: