గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే అక్కడి ఓటర్లు తరిమేస్తారని సీఎం కేసీఆర్ కు బాగా అర్థమైనట్టుందని వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా కేసీఆర్‌ పోటీ చేస్తున్నారని వై.ఎస్. షర్మిల ఆరోపించారు. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే నమ్మకం లేదని వై.ఎస్ షర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ పదేళ్ల పరిపాలనకు ఇది నిదర్శనమని.. వచ్చే ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం అని వై.ఎస్. షర్మిల అన్నారు.

కేసీఆర్ ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదని.. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదని వై.ఎస్. షర్మిల అంటున్నారు. పేరుకు సీఎం నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా రాలేదని.. దళిత బంధు ఇవ్వలేదని.. గజ్వేల్ లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులేనని వై.ఎస్. షర్మిల మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: