విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనుండటంతో ఉత్తరాంధ్ర చరిత్రలో నవశకం ప్రారంభం కానుందని చెప్పొచ్చు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం జగన్‌ ఈ వర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు.


ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించారు. అందులోనూ విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి... విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా ఈ వర్శిటీ స్థలాన్ని ఎంపిక చేయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: