పాతబస్తీలోని పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రధాన ఎన్నికల అధికారి వికాసరాజ్ కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వాట్సప్ ద్వారా సీఈవో వికాస్ రాజ్ కి కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్‌ పాల్పడ్డారని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ కంప్లయింట్ ఇచ్చారు.


సంబంధిత అధికారులతో దురుసుగా ప్రవర్తించడంతో వాటిని తనిఖీ చేయలేకపోతున్నారని.. ఎమ్మెల్యే, పోటీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఇది జరిగిందని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ అన్నారు. దోషులను గుర్తించడానికి ఆ నియోజకవర్గాల్లోని అన్ని వెబ్ కెమెరాలు , CC కెమెరాలను పరిశీలించేట్లు సంబంధిత అధికారులకు సూచించాలని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ డిమాండ్ చేశారు. తనిఖీ చేయడానికి సూచనలను జారీ చేయాలని.. ఆ మూడు  అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీపోలింగ్ చేయాలని కోరిన కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: