ప్రభుత్వ జీవో 46పైన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానిస్టేబుల్ నియామకంలో ఎంపికయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 46వల్ల తీవ్ర అన్యాయానికి గురయ్యామని కానిస్టేబుల్ అభ్యర్థులు వాపోయారు. కొత్తపేటలోని వీఎం హోం గ్రౌండ్‌లోకాంగ్రెస్ నాయకులను కలిసిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. ఫోటోలను తమకు గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రదర్శించారు. బిఆర్ఎస్ సర్కార్ తమకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పక్షాన నిలిచి విజయానికి కృషి చేశామని కానిస్టేబుల్ అభ్యర్థులు అన్నారు.

తమకు సెలెక్షన్ లో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు అన్నారు. సెలెక్షన్ సమయంలోనే తాము అప్పటి ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ తో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్న అందరినీ కలిస్తే మన సర్కార్ లో మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారన్న కానిస్టేబుల్ అభ్యర్థులు.. ఆ హామీని నిలబెట్టుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: