చంద్రబాబు పగలు మోదీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలిపే వ్యక్తి అని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు. అసలు చంద్ర బాబు - న‌రేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటో చెప్పాలని.. మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటో వివరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు.. గతంలో  పోలవరం ఏటీఎమ్‌లా వాడుకున్నారని మోదీ అన్నారని.. మరి అదే బాబు.. ఇప్పుడెలా పునీతుడు అయ్యాడో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

చిలకలూరిపేటలో మూడు పార్టీల సభ వెలవెలబోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. నన్ను క్షమించు మోదీ.. సీఎం వైయ‌స్ జగన్‌ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు సభలో మోడీని వేడుకున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఐదేళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారో చెప్పాలని.. ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చిందో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. మోదీని ఉగ్రవాది అన్న చంద్రబాబు.. ఐదేళ్లు తిరిగే సరికి విశ్వగురులా కనిపించారని పేర్ని నాని అడిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: