ఆయనో ఎస్సై.. తమకు కొందరు పోకిరీలు వేధిస్తున్నారని తన వద్దకు వచ్చిన ఓ ప్రేమ జంటను అడ్డుపెట్టుకుని లక్షలసంపాదించాలని ప్రయత్నించాడు. అయితే ఈ విషయం కాస్తా బయటకు రావడంతో ఏకంగా ఉద్యోగానికే ఎసరు వచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాచకొండ పరిధి ఉప్పల్‌ ఎస్సై శంకర్‌ ఇప్పుడు ఉన్నతాధికారుల చర్యలు ఎదుర్కొంటున్నారు. అసలేమైందంటే..  ఈనెల 15న ఉప్పల్‌ భగాయత్‌లోని హెచ్‌ఎండీఏ లే అవుట్‌లోకి కారులో ఓ ప్రేమజంట వచ్చింది. వారిని లోకల్ పోకిరీ గ్యాంగ్‌ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

దీంతో ఆ ప్రేమజంట నేరుగా ఉప్పల్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఎస్సై శంకర్‌ విచారణ జరిపి పోకిరీ గ్యాంగ్‌ను గుర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అమర్, ఉదయ్, రామ్‌చరణ్, శశివలి, మారుత్‌ను పీఎస్‌కు తీసుకొచ్చారు. ఇదే అదనకుగా ఆ పోకిరీల నుంచి కేసు రాజీ చేస్తానని లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎస్సై శంకర్‌ బాధితుల పట్ల కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించాడు. విషయం బయటకు రావడంతో ఎస్సై శంకర్‌ను డీసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: