కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఎగబాకుతున్న ఉల్లిగడ్డల ధర తాజాగా ‘ఆల్‌టైం హై’ను తాకడం జరిగింది. ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశానికి పెరిగింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌ ఎప్పుడు ధర లేనంతగా మొదటి రకం ఉల్లి హోల్‌సేల్‌లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలకడం జరిగింది. ఉల్లి ధర ఎందుకు ఇంత ఆకాశాన్ని అంటుతుందో చాలా మందికి అసలు అర్థం కావడం లేదు. ఇప్పటి పరిస్థితులలో సామాన్య మానవుడు ఉల్లిగడ్డల వైపు దాదాపుగా చూడడము మానివేశాడు. అందుకు కారణము ఒక కిలో 160 రూపాయలు 170 రూపాయలు ధర పలుకుతుంది.

 

 

 

 ఇంకొక పద్ధతిలో ఉల్లిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్‌ మార్కెట్‌లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి కొనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 వరుకు ఉంది మార్కెట్లోనే. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కెట్‌కు వెళ్తున్నవారు అరకిలోతో సరిపెట్టు కొని ఇంటికి తిరిగి రావడం జరుగుతుంది. ఇదే సీజన్‌లో కిందటి సంవత్సరం ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు తెలియచేస్తున్నారు.

 

 

 ప్రస్తుతం  తెలంగాణలో ఉల్లి సాగు ఎక్కువగా లేకపోవడంతో దాదాపు పొరుగు రాష్ట్రాలపైనే తెలంగాణ రాష్ట్రం ఆధార పడుతున్న పరిస్థి ఏర్పడింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలపై ఆధార పాడడం జరుగుతుంది. గత సంవత్సరం 4 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా ఈ ఏడాది కేవలం రెండున్నర లక్షల హెక్టార్లకు సాగు తగ్గి పోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో కాకుండా   ప్రస్తుత ముంబై, పుణేలోనే ఏకంగా ఉల్లి ధర కిలో గత 2–3 నెలలుగా రూ. 90 నుంచి రూ. 100 మధ్య మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక దిగుమతికి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నందు వల్ల ఆంధ్రరాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ధరలు అమాంతం పెరిగినవి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: