రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసింది. అమెరికా ప్రెసిడెంట్ ఈక్విటీ సంస్థ విస్టా ఈ క్రెడిట్ పార్ట్నర్, జియో ప్లాట్ ఫాంలో 2.3 % వాటాలను కొనుగోలు చేయబోతోంది. అయితే ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీస్ ఫోకస్ ఫోకస్డ్ ఫండ్ గా పేరు పొందిన విస్టా కంపెనీ సుమారు 11,367 కోట్ల విలువైన వాటాలను దక్కించుకుంది.

IHG


ఇక గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యం కావడం ఇదే. అయితే గత నెలలో రిలయన్స్ జియో ఫేస్ బుక్ డీల్ కుదిరింది. జియోలో 9.99 శాతం వాటాను ఫేస్ బుక్ కొన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ డీల్ విలువ సుమారు 43,574 కోట్లు. ఆ తర్వాత కూడా ప్రముఖ అమెరికా ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సిల్వర్ లేక్ పార్ట్‌ నర్స్ జియో ప్లాట్ ఫార్మ్ లో ఒక శాతం వాటాను కూడా కొనుగోలు చేసింది.

అయితే ఈ వాటా విలువ 5655 కోట్లు. ఇకపోతే విస్టా కంపెనీ సంస్థ మొదటి దశ నుంచి అత్యాధునిక కంపెనీలతో పెట్టుబడులు పెట్టిన ట్రాక్ రికార్డ్ ఆ సంస్థకు ఉంది. ఆ కంపెనీ గడిచిన పది సంవత్సరాల నుండి చాలా లాభదాయకంగా కొనసాగుతోంది. అయితే ఈ కంపెనీ మొట్టమొదటిసారి భారత్ లో పెట్టుబడి పెట్టింది. ఈ దెబ్బతో రిలయన్స్ జియో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ సంస్థగా ఎదుగుతుందని ఆశించవచ్చు. ఈ కంపెనీ పెట్టుబడి ద్వారా జియో సేవలందించడం పై వ్యాపార వర్గాల్లో నమ్మకం ఉంది. ఇస్తా పెట్టుబడి ద్వారా జియో నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ ఫ్లాట్ ఫామ్ గా నిలబడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: