మీరు జియో సిమ్ వాడుతున్నారా ...? అయితే మీకు ఒక శుభవార్త. జియో తన కస్టమర్లకు మళ్ళీ ఉచితంగా డేటాను అందించడాన్ని మొదలు పెట్టింది. అయితే ఈ డేటా ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఇవ్వబోతుంది. రోజుకు 2 జిబి చొప్పున హై స్పీడ్ డేటా ను ఐదు రోజులపాటు వినియోగదారులకు జియో సంస్థ అందజేయబడుతుంది. వాస్తవానికి ఈ ఆఫర్ ను జియో ఏప్రిల్ నెలలోనే అందించింది. అలాగే వర్క్ ఫ్రొం హోమ్ ప్యాక్ వ్యాలిడిటీ కూడా సవరించడం జరిగింది.

 

ఇంతక ముందుకు వీటి వాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ వాలిడిటీ గానే కనపస్తుంది. కానీ ఇప్పుడు వాటిని 30 రోజులకు మార్చడం జరిగింది. ఇదిలా ఉండగా కొంతమంది కస్టమర్లు తమ జియో అకౌంట్ లో 2 జిబి యాడ్ ఆన్ అందుబాటులోకి వచ్చిందని తెలియజేయడం జరిగింది. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ లను కూడా  వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు వారు. దీంతో వినియోగదారులకు 10 జీబీ డేటా ఉచితంగా వినియోగదారులకు అందిచడం జరుగుతుంది. కాని ఈ ఆఫర్ కొంతమంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి ఉంది.

 


అంతేకాకుండా మీ ప్రస్తుత ప్లాన్ ద్వారానే లభించే డేటా కు అదనంగా ఈ డేటా లభిస్తుందని సంస్థ తెలియజేసింది. ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందో లేదో అని తెలుసుకోవడానికి మీరు మై జియో యాప్ లో చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. జియో డేటా ప్యాక్ అనే టైటిల్ కింద మీకు ఈ డేటా కనిపిస్తుంది అని తెలిపారు. వాస్తవానికి జియో డేటా ఉచితంగా అందించడం ఇదే మొదటిసారి అయితే కాదు. చాలాసార్లు ఇదే తరహా లోనే ఇటువంటివి జియో అందించడం కూడా జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు బయటికి వెళ్లి రీఛార్జ్ చేసుకునే అవకాశం తక్కువగా ఉన్నందున jio POS లైట్ ఉపయోగిస్తూ అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అంతేకాకుండా ఈ ఆప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రీఛార్జ్ పై కమిషన్ కూడా వారికి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: