భార‌త దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా దారుల‌కు కొన్ని ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. రీసెంట్‌గా తన కస్టమర్లకు అదిరిపోయే బంప‌ర్ ఆఫ‌ర్‌ను చెప్పింది బ్యాంకు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకంలో భాగంగా ఇప్ప‌టికే ఖాతాలు తీసుకున్న తెరిచిన రికి ఈ ఆఫ‌ర్ లభిస్తుంది. ఎస్బీఐ రూపే డెబిట్‌ కార్డు ఉపయోగించే అన్ని ర‌కాల జన్‌ధన్‌ ఖాతాలకు రూ.2 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ను అందించ‌డానికి బ్యాంకు ప్ర‌ణాళిక రూపొందించింది.

2014లో స్టార్ట్ అయిన ప్రధాన్‌ మంత్రి జన్‌ ధన్‌ యోజన స్కీమ్ తో ఎన్నో లాభాలున్నాయి. ఈ స్కీమ్ ద్వారా ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డును జన్ ధన్ ఖాతాదారులకు ఇప్ప‌టికే అందించేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంది. దీని వ‌ల్ల ఈ కార్డు కలిగిన ఖాతాదారుల‌కు రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ బీమా సౌకర్యం అందిస్తోంది ఎస్బీఐ బ్యాంకు. కాగా రూపే కార్డ్ ప్ర‌స్తుతం ఉన్న ఏటీఎం లాగా పనిచేస్తుంది. దీని సహయంతో ఖాతాదారులు త‌మ అకౌంట్ నుంచి ఎప్పుడైనా డబ్బు డ్రా చేసుకోవచ్చు. దాంతో పాటు షాపింగ్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఖాతాదారులు.  

ఇప్పటి దాకా ఎవ‌రైనా జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయలేకపోతే వెంట‌నే మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఓపెన్ చేయండి. ఇందుకోసం అప్లికేష‌న్ ఫామ్ నింపాలి. అప్లికేష‌న్ ఫామ్‌లో పేరు, మొబైల్ నంబర్, ఇత‌ర అడ్ర‌స్ ఎంట్రీ చేస్తే స‌రిపోతుంది. అలాగే వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం మీద ఆధారపడుతున్న వారి సంఖ్య, వారికి చెందిన నామిని మొదలైన వివ‌రాల‌ను నమోదు చేస్తే స‌రిపోతుంది. ఇంకా ఏమైనా డౌన్స్‌ ఉంటే బ్యాంకు సిబ్బందికి అడిగి తెలుసుకోవ‌చ్చు.

10 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారెవ‌రైనా ఈ జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతాల‌ను ఓపెన్ చేయ‌డానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా కేవైసీకి సంబంధించిన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేయాలి. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి డ‌బ్బు చెల్లించాల్సిన ప‌నిలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: