ఒకదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే మరో దేశం, ఇంకా చెప్పాలంటే ఆ దేశానికి మించిన అభివృద్ధి చెందిన దేశాలు చూడలేవు. ముఖ్యంగా కొన్ని అగ్రరాజ్యాలు ఈ కోవలోకే వస్తాయి. తక్షణమే అవి ఆ దేశాలను ఎదగనివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో అని ఆలోచించి ఆ రకంగా ప్రయత్నిస్తాయి. అలా ఎప్పుడూ అగ్రస్థానంలో తమ రాజ్యాలదే స్థానం అన్నట్లుగా అవి బిహేవ్ చేస్తూ ఉంటాయి. భారత దేశం పై కూడా చాలా దేశాలకు ఇలాంటి భావమే ఉందన్నట్టుగా తెలుస్తుంది.


ఇలా ముందుగా అవి భారత్ లోని అత్యంత కుబేరుల పైన కాన్సెంట్రేట్ చేస్తాయి అని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే  ఆ దేశాలు ఇక్కడ ఉండే మన వాళ్ళలో కొంతమందిని తమ తొత్తులుగా చేసుకుని  పనిచేయిస్తూ ఉంటాయని తెలుస్తుంది. అవి తమ తొత్తులుతో సమాజంలో ఒక పానిక్ పరిస్థితిని కల్పించి ముందుకు వెళ్తాయని తెలుస్తుంది. ఆదాని విషయంలో అదే జరిగింది. ఈ మేధావుల రూపంలో ఉండే విదేశీ తొత్తులు ఆదాని షేర్లను డౌన్ అయ్యేలా చేశారని తెలుస్తుంది.


మరి ఎందుకు డౌన్ చేశారు అంటే ప్రపంచంలో‌ అనేక చోట్ల ఆయన పోర్టులు కొంటున్నాడని తెలుస్తుంది. అతను అమెరికాతో పోటీ పడుతున్నాడు, బ్రిటన్ తో పోటీ పడుతున్నాడు, ఇంకా చైనాతో పోటీ పడుతున్నాడు, ఫ్రాన్స్ తో కూడా పోటీ పడుతున్నాడు. దానితో ఇటు కమ్యూనిస్టులు, సానుభూతిపరులు అటు అమెరికా యూరప్ దేశాలతో మేధావులు అనిపించుకునే వాళ్ల తొత్తులు ఇద్దరూ కలిసి ఆదానిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో వాళ్లు 70%సక్సెస్ అయ్యారని, మిగిలిన 30%మాత్రమే పరిస్థితిని ఆదాని కంట్రోల్ లో పెట్టుకోగలిగాడని తెలుస్తుంది.


రెండో విషయం చెప్పుకోవాల్సి వస్తే ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అంటూ ఇదే మేధావులు రచ్చ రచ్చ చేశారు. వాళ్ల దెబ్బకి ఎల్ఐసి షేర్లు 40శాతానికి పడిపోయాయి. ఎల్ఐసి లాంటి మంచి కంపెనీని, కాపాడే ముసుగులో పాడు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: