
దేశీయ బులియన్ మార్కెట్లో శనివారం (2025 జూలై 19) బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరుగుదలను చూసింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర శనివారం నాడు రూ. 660 పెరిగింది. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,040గా ఉంది.
ఇక బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుస్తోంది. ఈ రోజు కిలో వెండి ఏకంగా రూ. 2,100 పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,26,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం మరియు వెండి ధరలు ఇలానే ఉన్నాయి. పసిడి ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నటువంటి పరిస్థితులే ముఖ్య కారణమని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు