ముంబై తీరంలో జ‌రిగిన పార్టీపై పోలీసులు దాడి చేయ‌గా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. దీంతో అత‌నిని పోలీసులు విచారించారు. అయితే, ఆర్యన్ ఖాన్ నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించామని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. ఆత‌ను యూకె మరియు దుబాయ్‌లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నాడ‌ని వెల్ల‌డించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్ట్ చేసిన తర్వాత, ఆర్యన్ ఖాన్ విచారణలో నిర్లక్ష్యంగా ఏడ్చాడని అధికారులు పేర్కొన్నారు.



ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఆదివారం అరెస్టయిన విష‌యం తెలిసిందే. విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ నిరంతరం ఏడ్చాడని ఎన్‌సిబి అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రశ్నించే సమయంలో, ఆర్యన్ ఖాన్ దాదాపు నాలుగేళ్లుగా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్న‌ట్టు చెప్పారు. ఆర్యన్ ఖాన్ యూకె, దుబాయ్ మరియు ఇతర దేశాలలో ఉన్నప్పుడు కూడా మాదకద్రవ్యాలను వినియోగించేవాడని ఎన్‌సీబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.



ముంబై తీరంలోని కార్డెలియా క్రూయిజ్ లో రేవ్ పార్టీ జ‌రిగిన  ఒక రోజు తర్వాత ఆదివారం రోజు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు ఎన్‌సీబి పోలీసులు. ఆర్యన్ ఖాన్‌తో పాటు, మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, గోమిత్ చోప్రా, నూపుర్ సారిక మరియు విక్రాంత్ చోకర్‌లు కూడా అరెస్టయ్యారు. ఆర్యన్ ఖాన్ మరియు అర్బాజ్ దాదాపు 15 సంవత్సరాలు స్నేహితులు.


ఆర్యన్ ఖాన్, మున్మున్ ధమేచా మరియు అర్బాజ్ మర్చంట్‌ను ఆదివారం రోజు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. వారికి అక్టోబర్ 4 వరకు ఎన్‌సిబి కస్టడీ విధించింది. ఆర్యన్ ఖాన్‌పై సెక్షన్ 27 , 8C మరియు నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ (NDPS) లోని ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు  చేశారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన తర్వాత షారూఖ్ తన కొడుకు ఆర్యన్‌తో 2 నిమిషాలు మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: