పోలీసుల్ని చూసి నేరస్థులు పారిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో వారినే ఎదిరిస్తారు. అయితే పోలీస్ అని తెలిసి కూడా కొంతమంది వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేయడం మాత్రం నిజంగా విషాదమే. ఇటీవల కాలంలో పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే ప్రథమం. నంద్యాల పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ హత్యోదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా పోలీసునే హతమార్చారంటే హంతకులు.. ఎంత బరితెగించారో అర్థమవుతోంది. వారి టార్గెట్ ఏంటి..? ఎందుకు పోలీస్ కానిస్టేబుల్ ని హత్య చేశారు అనే విషయం వెలుగులోకి రాలేదు.

ఆదివారం అర్థరాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. నంద్యాల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో 35 ఏళ్ల గూడూరు సురేంద్ర కుమార్ అనే కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. ఇతను డీఎస్పీ కార్యాలయం క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి యధావిధిగా డ్యూటీ అయిపోయిన తర్వాత బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు సురేంద్ర కుమార్. అయితే నగరంలోని రాజ్ థియేటర్ సమీపంలోకి రాగానే ఆరుగురు వ్యక్తులు ఆ కానిస్టేబుల్ బైక్ ని చుట్టుముట్టారు. అక్కడినుంచి అతడిని ఆటోలో తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చెరువు కట్టపైకి తీసుకెళ్లి పదనునైన కత్తితో అతని ఛాతిపై వీపులో పొడిచి పరారయ్యారని అనుమానిస్తున్నారు పోలీసులు.

కానిస్టేబుల్ పై కత్తులతో దాడి చేసిన అనంతరం హంతకులు అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆటోలో ఎక్కి పారిపోయారు. తాము దిగిపోతూ.. ఫలానా చోట ఓ వ్యక్తి గాయాలవతో పడిపోయి ఉన్నాడని, కాపాడాలని సూచించారు. ఆటో డ్రైవర్ గాయపడిన కానిస్టేబుల్ ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతను చనిపోయాడని అంటున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. ఈ సమాచారం గంటల వ్యవధిలోనే సంచలనంగా మారింది. పోలీస్ కానిస్టేబుల్ హత్యకు గురయ్యారని తెలియగానే పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ రఘువీర్‌ రెడ్డి హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల గాలింపు కోసం స్పెషల్ టీమ్ లు అరేంజ్ చేస్తున్నారు. రౌడీ షీటర్లే ఈ దారుణానికి ఒడిగట్టారేమోననే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. సురేంద్ర కుమార్ కి పరిచయం ఉన్నవారిని ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: