సాధారణంగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న యువతీ యువకులు శాలరీ కాస్త ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే . అయితే ఇటీవలి కాలంలో ఇలా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లుగా పనిచేస్తున్న వారు వచ్చిన డబ్బులతో సరిపెట్టుకోకుండా గొప్పలకు పోయి చివరికి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ జంట ఇలాంటిదే చేసింది అన్నది తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలని భావించింది ఒక టెక్కీ జంట. ఇక పెళ్లి కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవడం అని ఆలోచించారు. దీంతో ఇక నేరస్తులుగా మారేందుకు కూడా సిద్ధపడ్డారు.


 దీంతో ఈ జంట చోరీలకు ప్రయత్నించగా.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల దినేష్ కుమార్ 24ఏళ్ల సేమ్ భగవల్లి అలియాస్ ప్రియా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఇద్దరికీ సోషల్ మీడియా లో పరిచయం ఏర్పడింది.  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. చివరికి పెళ్లి ఖర్చుల కోసం దొంగలుగా అవతారమెత్తారు. ఇక ఇటీవలే వాడపల్లి సమీపంలోని బొమ్మనంపాలయం గ్రామంలో ఉంటున్న 76 ఏళ్ల రాయప్పన్ ఇంటికి వెళ్లి దాహం వేస్తోంది అని మంచినీరు కావాలంటూ అడిగారు.


 ఆ సమయంలోనే ఇక ఇంట్లో ఒక్కడే ఉన్నట్లు గమనించారు. దీంతో వృద్ధుడిపై దాడి చేసి 18 గ్రాముల బంగారం 1500 రూపాయల నగదు దోచుకున్నారు.  అదే సమయంలో ఇంటికి వచ్చిన రాయప్ప పెద్దకుమారుడు బాబు ఇక అక్కడినుంచి పారిపోతున్న దినేష్, ప్రియా లను చూసి గట్టిగా కేకలు వేసాడు. దీంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారిని పట్టుకున్నారు. చివరికి పోలీసులకు అప్పగించారు. ఇక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అంతకు ముందు కూడా ఇదే తరహాలో దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. పెళ్లి డబ్బుల కోసమే ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిజం ఒప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: