
ముఖ్యంగా నేటి రోజుల్లో అతివేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఏకంగా ఒక ప్రమాదాన్ని తప్పించేందుకు వేగంగా బైక్ నడిపితే మరో ప్రమాదం దూసుకు వచ్చి ఏకంగా ప్రాణాలు గాల్లో కలిసి పేసినంత పని చేసింది అని చెప్పాలి. ఈ ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కారులో వెళ్తున్న సమయంలో తండ్రికి గుండె నొప్పి వచ్చింది. దీంతో వెంటనే కొడుకు ఇక కారును ఎంతో వేగంగా హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
కానీ చివరికి కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. చివరికి చావు తప్పి కన్నులుట్ట పడింది అన్న విధంగా గాయాలతో బయటపడ్డారు. నోయిడాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బహ్లోల్ పూర్ నివాసి అయిన ప్రదీప్ సింగ్ తండ్రి బూప్ సింగ్ తోపాటు కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళుతుండగా బూప్ సింగ్ కు ఒకసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కంగారు పడిపోయిన కొడుకు ప్రదీప్ సింగ్ తండ్రిని కాపాడుకునేందుకు కారును వేగంగా పోనిచ్చాడు. దీంతో కారు ప్రమాదవశాత్తు గోతిలో పడింది. అందరికీ తీవ్ర గాయాలు కాగా బూప్ సింగ్ మరణించాడు.