
ఇటీవల కాలం లో పోలీసులు తరచు అక్రమార్కులను పట్టుకుని అరెస్టు చేస్తున్న అటు ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల దక్షిణ ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. ఏకంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న జంటను స్పెషల్ పోలీస్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. గంజాయిని 20 ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఇక అంతర్రాష్ట్ర డెలివరీ చేయడానికి కారులో పేర్చారు. దాదాపు 205 కిలోల గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు పక్క ప్లాన్ ప్రకారం బి.ఆర్.టి రోడ్డు లోని పుష్ప భవన్ సమీపంలో అక్రమార్కుల కోసం తనిఖీలు మొదలుపెట్టారు.
తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన డ్రైవర్ను ఇక కారు ఆపమని కోరారు. ఇక పోలీసులు ఉన్నారు అని గమనించిన డ్రైవర్ కారు వేగాన్ని పెంచి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించుగా ఇక బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి చివరికి అరెస్టు చేశారు అని చెప్పాలి. ఒడిశాలోని మారుమూల ప్రాంతం నుంచి సరుకులు సేకరించి ఇక ఢిల్లీ మరియు ఎన్సీఆర్లోని డ్రగ్ ఫెడరేల్స్ కి సరఫరా చేయబోతున్నట్లు ఇక పట్టుబడ్డ నిందితులు తెలిపారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వారి దగ్గర నుంచి 205 కిలోల గంజాయిని సిజ్ చేసి