ఇక్కడ ఒక ఏడాదిన్నర బుడ్డోడు కూడా తెలిసి తెలియక చేసిన పని చివరికి ప్రాణాల మీదికి తెచ్చింది. కానీ మృత్యుంజయుడిలా చివరికి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఏకంగా టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి స్విచ్ ఆన్ చేసింది తల్లి. కానీ కాసేపటికి తన ఏడాది వహిస్తున్న పిల్లాడు కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది. ఇల్లంతా వెతికిన బుడ్డోడు కనిపించలేదు. దీంతో ఆ తల్లిలో ఇంకా కంగారు పెరిగిపోయింది. అంతలోనే మనసులో ఒక అనుమానం మెదిలింది. దీంతో వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూడగా అంతే ఆమె గుండె పగిలిపోయినంత పని అయింది.
ఎందుకంటే వాషింగ్ మిషన్ లో ఆ బుడ్డోడు కనిపించాడు. ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వెంటనే భయపడిపోయిన తల్లి ఇక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఇక ఆ చిన్నారి శరీరం మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. స్పృహ కూడా లేదు. కానీ డాక్టర్లు అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లాడి పరిస్థితి గురించి వైద్య నిపుణులు హిమాన్షి మాట్లాడుతూ.. చిన్నారిని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి నీలం రంగులోకి మారిపోయాడు. అవయవాలు కూడా పనిచేయడం మానేశాయి. నిమోనియాతో జీర్ణకోశ ఇన్ఫెక్షన్స్ అవుతుందని తెలిపారు. ఇక 12 రోజులు నుంచి కోమాలో ఉండి తర్వాత వెంటిలేటర్ సహాయంతో చివరికి ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు అంటూ వైద్యులు తెలిపారు.