ప్రస్తుతం బీసీసీఐ  నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతుంది సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఐపీఎల్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది అన్న విషయం తెలిసింది. ఇక్కడ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఒకసారి టైటిల్ కూడా గెలిచింది. ఇక ఆ తర్వాత పలుమార్లు ఐపీఎల్లో ఫైనల్ వరకు చేరుకుంది అని చెప్పాలి. అయితే ఇక ఎప్పుడూ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఛాంపియన్ జట్లకు సైతం షాక్ ఇస్తూ ఉంటుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.


 అయితే ఒకప్పుడు తమ ఆట తీరుతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత కొంతకాలం నుంచి మాత్రం కెప్టెన్లను మార్చడం విషయంలో ఎక్కువగా వార్తలను నిలుస్తూ ఉంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఊహించని రీతిలో కెప్టెన్లను తరచూ మారుస్తూ వస్తుంది సన్రైజర్స్. సాధారణంగా సన్రైజర్స్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా ఉండేవాడు. ఇక కొన్ని సీజన్లకు కెప్టెన్గా డేవిడ్ వార్నర్ జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు.


 ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఏకంగా డేవిడ్ వార్నర్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది సన్రైజర్స్ యాజమాన్యం. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న మరో స్టార్ ప్లేయర్ ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న కేన్ విలియమ్స్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. అయితే కేన్ విలియమ్సన్  కూడా సన్రైజర్స్ ను ఎంతో సమర్థవంతంగానే ముందుకు నడిపించాడు.. కానీ ఇటీవల ఏకంగా కేన్ విలియమ్సన్ ను కూడా జట్టు నుంచి వేలంలోకి వదిలేసింది. ఇక కొత్త ఆటగాళ్ళను జట్టులోకి తీసుకుంది.


 ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఎవరికి జట్టు సారధ్య బాధ్యతలు అప్పగించబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.  సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్ గా కొనసాగుతున్న ఐడెన్ మార్కరమ్ ను  ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా సన్రైజర్స్ జట్టు కెప్టెన్ గా మార్చింది. కాగా ఐపీఎల్ లో ఇప్పటివరకు సన్రైజర్స్ ఏకంగా తొమ్మిది మంది కెప్టెన్లను మార్చింది. అయితే ఇప్పటివరకు అత్యధిక కెప్టెన్లను మార్చిన జట్టుగా అటు పంజాబ్ టాప్ లో ఉంది అని చెప్పాలి. పంజాబ్ ఐపీఎల్ చరిత్రలో 14 మంది కెప్టెన్లను మార్చింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ 12 మంది, ముంబై, బెంగళూరు జట్లు ఏడుసార్లు, రాజస్థాన్, కోల్కతా, పూనే ఆరుసార్లు చెన్నై మూడుసార్లు కెప్టెన్ లను మార్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: